* ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో జూబ్లీహిల్స్ ఓటమిపై చర్చ
* కవిత వాఖ్యలపై సీరియస్‌గా మంతనాలు
* తెలంగాణ భవన్లో ఈనెల 18న కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేసీఆర్‌తో కేటీఆర్ శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఎర్రవెల్లి పాం హౌజ్‌లో ఆయనను కలిసి జూబ్లీహిల్స్ ఓటమిపై చర్చించారు. ఓటమికి గల కారణాలు.. భవిష్యత్ వ్యూహాలపై సుధీర్ఘంగా చర్చ సాగింది. ఈ మధ్య కాలంలో బీఆర్ ఎస్, హరీష్‌రావుపై కవిత చేసిన కామెట్స్పై కేసీఆర్ దృష్టికి తీసికెళ్లినట్లు తెలుస్తోంది. జాగృతి జనం బాటలో కవిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. బీఆర్ ఎస్ అధ్యక్షులు కేసీఆర్ మినహా.. ముఖ్య నేతలపై కవిత తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య నాయకుల బండారం బయటపెట్టడంతో కవిత వ్యవహార శైలిపై మంతనాలు జరిపారు. హరీష్‌రావు, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న కవిత వ్వాఖ్యలపై బీఆర్ ఎస్ స్పందించలేదు. ఈ భేటీ అనంతరం కేటీఆర్ స్పందిస్తారా అని నాయకులు చూస్తున్నారు. జిల్లాల్లో దశలవారిగా కేటీఆర్ పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 18న బీఆర్ ఎస్ కార్యకర్తలతో తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించనున్నారు. ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ ఎస్‌ను వీడినప్పటి నుంచి ఒక్కో నాయకుని చిట్టాను బయట పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కవితపై ఏ నిర్ణయం తీసుకుంటారోనానే చర్చ సాగుతోంది.
………………………………………………………..
