* 42 శాతం అమలుపై చర్చించే అవకాశం
* రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించేలా ఎంపీలకు మర్గనిర్దేశం
* మంత్రివర్గం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ విజయంతో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. అదే ఊపుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా సీఎం రేవంత్ సమాలోచనలు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. జీపీ ఎన్నికలపై. బీసీలకు 42 శాతం అంశంపై మంత్రివర్గ సమావేశంలో క్షుణ్నంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం మీడియా సమావేశంలో ప్రకటించారు. దీంతో సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారే ఉత్కంఠ నెలకొంది. 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే అంశంపై మంత్రులతో చర్చించి సీఎం రేవంత్ ముందుకెళ్లనున్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని సీఎం పదే పదే చెబుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నా.. నిధులు, అభివృద్ధికి అడ్డుపతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ పనులపై నివేధిక తయారు చేసి రాష్ట్ర ఎంపీలకు పంపించి పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో కేంద్రంపై ఒత్తి తెచ్చేలా చూస్తోంది.
రాష్ట్రంలోని గిగ్వర్కర్లకు కనీస వేతనాల అమలుపై చట్టం తీసుకువచ్చే ఆలోచనలో వాటి విధి విధానాలపై చర్చించనున్నారు. రేపటి మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
………………………………………………….
