Nitish Kumar
* 19, 20న సీఎంగా ప్రమాణస్వీకారం
* పట్నాలోని గాంధీ మైదానంలో చకచకా ఏర్పాట్లు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఎన్డీయే కూటమి కొలువుదీరనుంది. నితీష్‌కుమార్ ప్రభుత్వం ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19 లేదా 20న బీహర్ సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకు ముందు సోమవారం గవర్నర్‌కు నితీష్‌కుమార్ రాజీనామా సమర్పించనున్నారు. మరో సారి నితీష్‌కుమార్ సీఎం పగ్గాలు చేప్టనున్నారు. 17వ శాసనసభ రద్దు తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించనుంది. నితీష్‌కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీయే భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. కూటమి ఎమ్మెల్యేలు ఎన్డీయే నేతను ఎన్నుకోనున్నారు. 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ 35 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్డీయే పక్షాలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను అనుమతి కోరుతాయి. అనంతరం పట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుంది. ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహోత్సవానికి ప్రదాని మోదీ రానున్నారు. ఒక రాష్ట్రానికి పది సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నేతగా నితీష్‌కుమార్ రికార్డు సాధించారు.
……………………………………………….
