* స్పష్టం చేసిన ఎంఐఎం ఎంపీ అసదొద్ధీన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎంఐఎం ఎంపీ అసదొద్ధీన్ ఓవైసీ స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై నోరు విప్పారు. ఉప ఎన్నికలో తాము కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేదని.. వ్యక్తిగతంగానే నవీన్ యాదవ్కు సపోర్టు చేశానని స్పష్టం చేశారు. కొందరు నాయకులు ఎంఐఎం మద్దతుతోనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారని చెప్పడం అంతా అబద్ధమని కొట్టిపారేశారు. కేసీఆర్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నవీన్ యాదవ్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
…………………………………………………….
