* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం మహా జాతరను పురస్కరించుకొని జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు ఆదివారం మంత్రి ఆకస్మికంగా మేడారంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు మొదట సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అనంతరం మేడారంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జంపన్నవాగు , చీలకగుట్ట , స్నాన ఘట్టాలను , మేడారం గుడి ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ టి ఎస్ దివాకర , అధికారులతో కలిసి పరిశీలించారు
జంపన్న వాగు వద్ద భక్తులు ఇబ్బంది లేకుండా మెట్ల వద్ద పరిశుభ్రంగా ఉంచాలని,జంపన్న వంతెన పైన జాలి ఏర్పాటు చేసి ఉంచాలని అధికారులకు సూచించారు.సమ్మక్క, సారలమ్మ గద్దెల చుట్టూ నూతనంగా నిర్మించబోయే ప్రహరీ గోడ నిర్మాణాన్ని మంత్రి కొబ్బరి కాయ కొట్టి ప్రారంబించారు.పనులు పూర్తి చేసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.అనంతరం బయ్యాక్కపేటలోని సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుని అక్కడ అభివృద్ధి పనుల చేపడతామని అన్నారు .అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి , తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ , సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్ , మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చుపటల్ , గౌరవ మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి , మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు , ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరిల వెంకన్న , మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వర్ రావు , మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర , మండల సీనియర్ నాయకులు తాన్డాల శ్రీను , మేడారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధబోయిన రానా రమేష్ , మండల నాయకులు ఎనాగాంధుల బాపు రెడ్డి , మహిళా నాయకురాలు గొంది సరిత , ఆర్ & బి అధికారులు , స్థానిక ఎమ్మార్వో , అధికారులు , జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు , మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….
