ఆకేరు న్యూస్, డెస్క్ : సౌదీలో భారతీయులు సజీవ దహనమైన ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. మదీనాలో భారతీయులు మృతిపై తీవ్ర దిగ్బ్రంతి వ్యక్తం చేశారు. రియాజ్ లోని ఎంబాసీ జెడ్డాలోని కాన్సలెట్ పూర్తి సహాయ కహకారాలు అందిస్తోందని ఎక్స్ వేదికగా తెలిపారు. మృతి చెందిన కుటంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద సమయంలో యాత్రికులు అంతా నిద్రలో ఉండడంతో.. మృతుల సంఖ్యఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 మంది మహిళలు..11 చిన్నారులు సహా 42 మంది సజీవదహనమయ్యారని అక్కడి మీడియా కథనాలు ప్రచురించాయి. ఘటనలో హైదరాబాద్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
………………………………………………..
