ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన గంప సుమలత ఇల్లు షార్ట్ షర్కూట్ వల్ల కాలిపోగా రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క బాధితుల కుటుంబానికి దైర్యం చెప్పారు. పూర్తిగా ఇల్లు దగ్ధం కావడంతో వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఆకుటుంబానికి బియ్యం, దుప్పట్లు,దుస్తులు నిత్యావసర సరుకులు,ఆర్థిక సహాయం అందించారు. మంత్రి సీతక్క వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి ,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ,జిల్లా నాయకులు,సీనియర్ నాయకులు,మండల నాయకులు,యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………………
