సుప్రీంకోర్టు
* మూడు నెలలైనా చర్యలు తీసుకోకపోవడంపై అసహనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపు ఎంఎల్ ఏలపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసింది. మీరు చర్యలు తీసుకుంటారా.. లేక మీమే చర్యలు తీసుకోమంటారా అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. సుప్రీకొర్టు నోటీసులపై స్పీకర్ కార్యాలయం స్పందించి 8 వారాల సమయం కావాలని కోరింది. ఇందుకు సుప్రీం నాలుగు వారాల గడువు ఇస్తున్నామని.. ఈలోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
……………………………………………….
