ఆకేరు న్యూస్, వరంగల్ : ఓరుగల్లు కోటలో పోలీసులు రెక్కీ నిర్వహించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా సంస్థలు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు(ఆక్టోపస్) చారిత్రక నగరమైన ఓరుగల్లు కోటలోని ప్రధాన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలపై రెక్కీ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి 25 ప్రత్యేక పోలీసు బృందం ఓరుగల్లుకు చేరుకొని దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు పసిగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఢిల్లీ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలపై భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా ఈ ముందస్తు తనిఖీలు, రెక్కీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ బృందం ఈ ప్రాంతంలోని భద్రతా లోపాలను, ముప్పు కలిగే అవకాశాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తమ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
……………………………………………………..
