* బంగ్లాదేశ్ లో ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, డెస్క్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐటీసీ) కోర్టు తీర్పునిచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. అల్లర్ల సమయంలో అమాయకులను కాల్చి చంపాలని ఆదేశాలు ఇచ్చారని ఐసీటీ కోర్టు అభిప్రాయపడింది. షేక్ హసీనా తీరు మానవత్వానికి మాయని మచ్చగా న్యాయస్థానం పేర్కొంది. తన తల్లికి ఉరిశిక్ష పడే అవకాశం ఉందని ఆమె కుమారుడు వాజిద్ నిన్ననే వెల్లడించారు. నేడు తీర్పు వెలువరించనుంది. అయితే ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో ఉన్నారు. 2024లో జరిగిన ఘటనకు సంబంధించి ఈ తీర్పు వెలువరించింది. హసీనా కేసు వాదనల నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ఉద్రిక్తత ఏర్పడింది ఆమె నిన్న రాత్రి ఫేస్ బుక్ వేదికగా ప్రసంగం చేశారు. తాను బతికే ఉంటానని, భయపడబోనని, దేశ ప్రజలకు మద్దతుగా నిలుస్తానని పేర్కొన్నారు. కాగా, హసీనాకు మరణశిక్ష విధిస్తారన్న వార్తలతో ఆమె మద్దతు దారులు నేడు దేశ వ్యాప్త బంద్ కు పిలుపు నిచ్చారు.
………………………………………………….
