* 8 మందికి తీవ్ర గాయాలు
* యాజమాన్యంపై ప్రయాణికుల ఆగ్రహం
ఆకేరు న్యూస్, నందిగామ : కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు లారీని ఢీకొట్టింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని ఓవర్టేక్ చేస్తుండగా బస్సు అదుపు తప్పింది. కావేరీ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు 20 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలో నందిగామ వద్ద జాతీయ రహదారిపై లారీని ఓవర్ టేక్ చేస్తుండగా డ్రైవర్ అదుపుతప్పాడు. దీంతో బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు ఎడమ వైపు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులు వరుసగా ప్రమాదానికి గురవుతున్నా.. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రావెల్స్‌కు చెందిన బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీ చేసి రూల్స్‌కు విరుద్దధంగా నడుస్తున్న బస్సులను సీజ్ చేయాలని కోరుతున్నారు.
……………………………………………..
