* విజయవాడలో 27 మంది అరెస్టు
* భారీ ఎత్తున డంప్ లు స్వాధీనం
* అధికారికంగా వెల్లడి కావాల్సి ఉన్న వివరాలు
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్ల్ ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల కదలికలపై సమాచారం ఉన్న నేపథ్యంలో కూంబింగ్ చేస్తున్నపోలీసులకు మావోలు కంటపడ్డారు. ఈక్రమంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు హతమైన విషయం తెలిసింది. మరోవైపు విజయవాడలో కూడా మావోయిస్టులు కలకలం రేపారు. కానూరు ఆటోనగర్ ల్ ఏకంగా 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ భవనంలో దాగి ఉన్న వీరి అరెస్టుతో ఆటోనగర్ ఉలిక్కిపడింది. వీరంతా ఛత్తీస్ గఢ్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వాళ్లలో 12 మంది మహిళలే ఉన్నట్లు తెలిపారు. నాలుగు చోట్ల డంప్ లు ఏర్పాటు చేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అరెస్టయిన వాళ్లలో నలుగురు కీలక నేతలు ఉన్నట్లు తెలిసింది. స్థానిక పోలీసుల సహాయంతో ఆక్టోపస్ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులు పెట్టిన డంప్ ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు అరెస్టు కావడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమంగా తెలుస్తోంది. కొద్ది సేపట్లో కృష్ణా జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించనున్నారు.
…………………………………………………
