* వచ్చే నెల 9న విజన్ డాక్యూమెంట్
* గుజరాత్ కు మోదీ ఇచ్చిన సహకారమే మేం కోరుకుంటున్నాం
* హోటల్ ఐటీసీ కోహినూర్ సమావేశంలో సీఎం రేవంత్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తే.. మరింత వేగంగా దేశాభివృద్ధి సాధిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలపడి ప్రపంచంలో కీలకంగా ఉంటామని స్పష్టం చేశారు. హోటల్ ఐటీసీ కోహినూర్‌లో రాష్ట్రాల పట్టణాభివృద్ధి, మంత్రుల సమావేశం మంగళవారం నిర్వహించారు. కేంద్ర మంత్రి మనోహర్ కట్టర్ హాజరైన ఈ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. జీడీపీలో 5 మెట్రోపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, ముంబై, బెంగుళూర్, చెన్నయి, హైదరాబాద్ కీలకంగా ఉన్నాయన్నారు. కేంద్రం సహకరించకుంటే అభివృద్ధి మందగిస్తుందని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్ ఆర్ ఆర్, మూసీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు.
డిసెంబర్ 9 విజన్ డాక్యూమెంట్
వచ్చే నెల 9 తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యూమెంట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2034కు 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్వవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించనున్నట్లు ఈ సిటీ న్యూయర్క్, టోక్యో, జపాన్, సింగపూర్, దుబాయ్ లాంటి దేశాలతో పోటీ పడేలా ప్యూచర్ సిటీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షళన చేసినట్లే.. తెలంగాణాలో మూసి పునరుజ్జీవం చేపట్టామన్నారు. ఏపీ పొంగూరు మంత్రి నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్, మోహన్‌లాల్ దేశాయ్ పాల్గొన్నారు.
……………………………………………………..
