* డ్రగ్స్ రహిత ములుగు జిల్లాను నిర్మిద్దాం…
* జిల్లా సంక్షేమ అధికారి తుల రవి
ఆకేరు న్యూస్, ములుగు: మాదక ద్రవ్యాలను అరికడదాం.. డ్రగ్స్ రహిత జిల్లాగా ఏర్పాటు కు యువత కృషి చేయాలని ములుగు జిల్లా సంక్షేమ శాఖ అధికారి తుల రవి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో “నషా ముక్త్ భారత్ అభియాన్” 5 సం.ల వేడుకలను పురస్కరించుకొని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికార శాఖ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల ,స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బహిరంగ అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి భగవద్గీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి శ్రీ తుల రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అందరం కలిసి డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. యువతే దేశ భవిష్యత్తు అని, మీ తల్లి తండ్రులు మీ పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారని, ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించి కుటుంబానికి, ఈ దేశానికి గొప్ప ఆస్తిగా ఎదగాలని సూచించారు. చదువుతున్న యువత స్వతహాగా మంచి ఆలోచనతో ఉన్నా కూడా చుట్టూ ఉన్న సహచరుల ప్రభావం వల్ల చాలా మంది సిగరెట్, గంజాయి వంటి డ్రగ్స్ కి అలవాటు అయ్యే ప్రమాదం ఉందని, ఒకసారి డ్రగ్స్ కి అలవాటు అయితే వాటి నుండి దూరం కావడం చాలా కష్టం అన్నారు. సమాజం ఇలాంటి వారిని చిన్న చూపు చూస్తుందని. డ్రగ్స్ కి బానిస అయిన వారిని బయటకు తీసుకు రావడానికి కేవలం కౌన్సిలింగ్ అనే ఒక మార్గం మాత్రమే ఉందని, ఎవరినైనా అలాంటి పరిస్థితుల్లో గుర్తిస్తే TGANB, నషా ముక్త్ భారత్ అభియాన్ విభాగాలను సంప్రదించాలని అన్నారు.
అనంతరం జిల్లా బాలల పరిరక్షణ అధికారి J. ఓంకార్ మాట్లాడుతూ నేటి సమాజాన్ని డ్రగ్స్ భూతంలా పట్టి పీడిస్తుందని, డ్రగ్స్ అంటే గంజాయి మాత్రమే కాదని సిగరెట్, గుట్కా, జర్దా అది ఏ రూపంలో ఉన్నా డ్రగ్స్ గానే భావించాలని తెలిపారు. కంట్రోల్ గా డ్రగ్స్ తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు కూడా వాటికి అలవాటైతే వారే డ్రగ్స్ కంట్రోల్ లోకి వెళ్తారని అన్నారు. ఒకసారి డ్రగ్స్ కి అలవాటు అయితే వాటిని కొనుక్కోవడం కోసం దొంగతనాలకు అలవాటు అయ్యే పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రతీ ఒక్కరూ తమ చుట్టుపక్కల ఉన్న వారిపై, స్నేహితులపై ఓ కన్ను వేసి ఉంచాలని, వారి క్రమశిక్షణ, ప్రవర్తన లో ఏవిధమైన మార్పులు గమనించి కౌన్సిలింగ్ చేయాలని, లేనిచో టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ నిర్మూలనలో పోలీస్ శాఖ చేస్తున్న యజ్ఞం లో భాగస్వామ్యం కావాలని ప్రతిఒక్కరికీ సూచించారు.మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుందని, దీనిని విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అంతా భాగస్వాములం అవుతామని కమ్యూనిటీ ఎడ్యుకేట్ అనూష ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారితో ప్రతిజ్ఞ చేయించారు.మొదట మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవద్గీత లతో కలిసి జెండా ఊపి డ్రగ్స్ వ్యతిరేక అవగాహనా ప్రత్యేక ర్యాలీని ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల 200 మంది విద్యార్థినీ విద్యార్థులు, యువత, ములుగు ICDS ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న వివిధ విభాగాల అధికారులు నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా ఇంచార్జ్ నాగేంద్ర, DWO కార్యాలయ సిబ్బంది మీర్జా బేగ్, FRO గణేష్, DCPU, CHL, సఖి, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, వివిధ శాఖల అధికార యంత్రాoగం, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.

………………………………………………………………
