* కాల్పుల్లో మరో ఇద్దరు అగ్రనేతలు..?
* అధికారికంగా వెల్లడించని పోలీసులు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆంధ్రలో మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి సమీపంలో ఉన్న జియమ్మ వలసలో కాల్పులు జరిగినట్లు తెలిసింది. పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పార్టీ అగ్రనేతలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన సంఘటన వాస్తవమేనని ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్రా లడ్డా తెలిపారు. ఎన్కౌంటర్లో చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
…………………………………………
