* పిల్లలు, వృద్ధులకు డాక్టర్ల సూచనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చలితో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో రానున్న రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆసిఫాబాద్, కుమ్రంభీం, నిర్మల్ జిల్లాలతోపాటు మరో ఐదు జిల్లాలలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. నిన్న రాత్రి నుండి ఈ రోజు ఉదయం వరకు తెలంగాణలో ఉష్ణోగ్రతల నమోదు ఈ విధంగా ఉంది. ఆసిఫాబాద్ 7.9, ఆదిలాబాద్ 8.8, సిరిసిల్ల 9.0, కామారెడ్డి 9.3, నిజామాబాద్ 9.4, సంగారెడ్డి 9.5, నిర్మల్ 9.7, జగిత్యాల 9.8, సిద్దిపేట 9.6, మెదక్ 10.1, కరీంనగర్ 10.6, రాష్ట్రంలో మరో రెండు రోజులు తీవ్ర చలిగాలులుంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
…………………………………………………………
