* 2015-16 గ్రూప్ -2 రద్దు
* పునర్ మూల్యాంకనం నిర్వహించి జాబితా విడుదల చేయాలి
* గ్రూప్-2లో 13 కేటగిరీల్లో 1032 పోస్టులు భర్తీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హై కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 2015-16 గ్రూప్ -2 రద్దు చేసింది. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కకుపెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనని తేల్చింది. 2019 అక్టోబర్ 24 నాటి ఫలితాలు ఏకపక్షమని రద్దు చేసింది. మరోసారి మూల్యాంకనం చేపట్టాలని సూచించింది. జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని తేల్చిచెప్పింది. ఇందుకు గాను 8 వారాల గడువు ఇచ్చింది. ఇచ్చిన గడువులోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. దిద్దుబాటు, వైట్ నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్ చోటు చేసుకున్నాయని.. దీంతో వాటిని రద్దు చేయాలని దాఖలైన 6 పిటిషన్లపై జస్టిస్ నగేష్ విచారణ చేపట్టి తీర్పు ఇచ్చారు.
…………………………………………………
