ఆకేరు న్యూస్ డెస్క్ : ఏపీలో ఇటీ వల కాలంలో మొత్తం 50 మంది సీపీఐ (మావోయిస్ట్) కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు ఏపీ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అరెస్ట్ అయిన వారిలో మంగళ వారం ఎన్ కౌంటర్ కు గురైన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు, వీరిలో అనేకమంది చనిపోయిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, దేశంలో అత్యంత భయంకర మావోయిస్టు నాయకుల్లో ఒకరైన మడివి హిడ్మాకు అత్యంత సన్నిహితంగా పనిచేసినట్లు తెలుస్తోంది.పోలీసు వర్గాల ప్రకారం, అరెస్టు చేయబడిన మావోయిస్టుల్లో చాలామంది ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్కా, బీజాపూర్, నారాయణపూర్, వెస్ట్ బస్తర్ జిల్లాల నుండి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉంటూ తమ కార్యకలాపాలను కొనసాగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.తదుపరి ఆపరేషన్ల వ్యూహాలు సిద్ధం చేయడం వంటి లక్ష్యాలతో కదిలినట్లు సమాచారం.అరెస్టు చేయబడిన వారిలో సౌత్ బస్టర్DVC చెందిన సోడే దు @ గోపాల్, BNPC బెటాలియన్ హెన్నార్టర్స్ కంపెనీకి చెందిన పొడియం రంగు, అలాగే బీజాపూర్ జిల్లా ఫార్సీమడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముక్కారం గ్రామానికి చెందిన సీనియర్ SXCM ఉద్దే రఘు ఉన్నట్లు తెలిపారు..
Divisional Committee Members (DVCMs) – 5 5 మంది అరెస్ట్
ఈ ఆపరేషన్‌లో CPI (మావోయిస్టు) లో అత్యంత కీలక నిర్వహణ స్థాయిని కలిగిన ఐదుగురు Divisional Committee Members (DVCMs) అరెస్టు అయ్యారు
అరెస్టు చేయబడిన DVCMs వివరాలు…
1. సోడి లక్ష్మా @ భీమా – జగల్గొండ ఏరియా కమిటీ (AC) DVCM
సుక్మా-జగల్గొండ స్క్వాడ్ల పర్యవేక్షణలో కీలకపాత్ర..
2. గంగి లక్ష్మీ @ మాడే – కేర్ పాల్ AC, ధర్భా డివిజన్
ప్రధాన ట్రాన్సిట్ మార్గాలు, సహాయక నోడ్ల నిర్వహణలో ప్రత్యేక నైపుణ్యం.
3. సోడే మనీలా – పామేడ్ AC, SBT DVC, DKSZC
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) లో అత్యంత వ్యూహాత్మక స్థానం కలిగి, దక్షిణ బస్తర్ మొత్తం కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేసిన కీలక బాధ్యతదారి..
4. మడకం మదన్ @ మధన్న @ జగ్గు @ లక్ష్మా- జగల్గొండ AC, SBT DVC, DESZC
జగల్గొండ నుండి కిస్టారాం వరకు ఉన్న కార్యాచరణ హార్ట్ లైన్ ను పర్యవేక్షించిన సీనియర్ ఆపరేషనల్ కమాండర్.
5. మడివి హందా – కమ్యూనికేషన్ & CyPC టీం, SBT DVC
టెక్నికల్ కమ్యూనికేషన్ నిర్వహించే వారు....
ఏరియా కమిటీ సభ్యులు (ACMs) – మొత్తం 19 మంది
కృష్ణా, ఏలూరు మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ స్థాయిలో ACMలను అరెస్టు చేయబడ్డారు:
మడకం దివాకర్ @ మిటు, ACM, 2వ కంపెనీ, 2వ ప్లాటూన్ (PPCM)
* • వెట్టి వెంకట్. ACM, SZCM గోపాల్‌కు సహాయకుడు
* మడకం వాగ, ACM, ఇన్-చార్జ్ ప్రెస్ కమిటీ, SBT DVC
కశ్యప్ భీమా @యోగేశ్. ACM, వెస్ట్ బస్తర్ DVC
పోడియం ఆనంద్ @ దన్ను, ACM, సామేద్ AC
మడకం లక్ష్మణ్ @ కోసా, ACM, 8వ ప్లాటూన్, SBT DVC
దక్షిణ బస్తర్, కిస్తారాం AC. జగర్గాండా AC మరియు వెస్ట్ బస్తర్‌లోని రీజినల్ కంపెనీలకు చెందిన అనేకమంది ACMలు
Platoon Members (PMs) – 23 మంది అరెస్టు
ఈ ఆపరేషన్‌లో పామేడ్ AC, గంగలూరు AC, జగల్గొండ AC, హెడ్‌క్వార్టర్స్ కంపెనీ, LOS టీంలు, ప్రొటెక్షన్ టీంలకు చెందిన మొత్తం 23 మంది సాయుధ ప్లటూన్ మెంబర్లు (PMs) అరెస్టు చేయబడ్డారు.
ఈ 23 మంది ప్లటూన్ సభ్యుల అరెస్టుతో మావోయిస్టుల బెటాలియన్ స్థాయి కార్యాచరణ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. 100% విజయం – ఎటువంటి ప్రాణనష్టం లేకుండా అరెస్టులను పూర్తి చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
………………………………………………………………..
