encounter Police Force - File
* వైద్య పరిక్షల అనంతరం కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
ఆకేరు న్యూస్, డెస్క్ : లొంగిపోయిన మావోయిస్టులను కోర్టులో హాజరు పరిచారు. అరెస్టు చేసిన 50 మంది మావోయిస్టులకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులు మరణించారు. మరోవైపు అదే సమయంలో ఏలూరు, కాకినాడ, విజయవాడలలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు అందిన పక్కా సమాచారంతో 50 మంది మావోలను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలకు మావోయిస్టులు ఎందుకు వచ్చారు. దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? ప్రముఖులను ఎవరినైనా టార్గెట్ చేసుకున్నారా? అనే కోణంలో విచారిస్తున్నారు. విచారణలో భాగంగా వీరి నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరించారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు కూంబింగ్‌ను తీవ్రతరం చేశాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
…………………………………..
