బీజేపీ ఎంపీ బండి సంజయ్
* నా నోటి నుంచి హిందుత్వం మాట ఆగితే.. అప్పుడే నా శ్వాస ఆగిపోద్ది
* హిందు ఓటు బ్యాంక్‌తోనే ఎంపీగా గెలిచానంటూ.. బండి ఎమోషనల్ కామెంట్స్
ఆకేరు న్యూస్, కరీంనగర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా హజూరాబాద్‌లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నా నోటి నుంచి హిందుత్వం మాట ఆగితే.. అప్పుడే నా శ్వాస ఆగిపోద్ది అంటూ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హిందువుల ఓటుతోనే బీజేపీ హైదరాబాద్‌లో బలపడిందని.. తానూ కరీంనగర్ ఎంపీగా హిందువులు వేసిన ఓట్లతోనే గెలిచానని చెప్పారు. బీజేపీ మూల సిద్ధంతమే హిందుత్వమని గుర్తు చేశారు. నా నోటి నుంచి హిందుత్వం మాట ఆగితే.. అప్పుడే నా శ్వాస ఆగిపోద్ది అంటూ.. బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. బండి మాటలకు ఈటెల.. ఈటెల మాటలకు బండి చేస్తున్న మాటల యుద్ధం పార్టీలో కొనసాగుతోంది.
……………………………………………
