– పోరాటం వారిదైతే.. పదవులు అర్బన్ నక్సలైట్లవి
– తుపాకీతో రాజ్యాధికారం అసాధ్యం.
– కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హుజూరాబాద్: వచ్చే సంవత్సరం మార్చిలోపు మావోయిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామనీ, అమిత్ షా మాటంటే మాటే ననీ, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.హుజూరాబాద్‌లోని మధువనీ గార్డెన్ లో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్షుల, కార్యదర్శులు, సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అర్బన్ నక్సల్స్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… అడవుల్లో ఉద్యమం పేరుతో అయాయకులైన దళిత, గిరిజన, ఆదివాసీ అమాయకులను నక్సలైట్లుగా మార్చి,రెచ్చగొడుతూ వాళ్ల చావులకు సోకాల్డ్ అర్బన్ నక్సలైట్లే కారణమని బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.పోరాటం వాళ్లు చేస్తే .. పదవులు మాత్రం అర్బన్ నక్సలైట్లు అనుభవిస్తున్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు.ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే స్పందించాల్సిన సోకాల్డ్, అర్బన్ నక్సలైట్లు ఎందుకు గొంతెంతడం లేదంటూ ప్రశ్నించారు. ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అర్బన్ నక్సలైట్లు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని ప్రశ్నించారు.
దయచేసి నక్సలైట్లంతా లొంగిపోవాలి
వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని, దయచేసి నక్సలైట్లంతా అని బండి సంజయ్ అన్నారు. లొంగిపోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నామని దాంతో వారు సంతోషంగా జీవించవచ్చునని అన్నారు. నక్సలిజాన్ని ఎవరు సమర్ధించినా వాళ్లు కూడా నేరస్తులే. మావోయిస్టులే తుపాకులు వదిలి జన జీవన స్రవంతిలో కలుస్తుంటే……… అందుకు భిన్నంగా అర్బన్ నక్సల్స్ తుపాకులు పట్టండి, మావోయిస్టుల్లో చేరండి అంటే ఊరుకుంటామా? అది సమర్ధనీయమా? వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని బండి సంజయ్ అన్నారు.
………………………………………………
