* భార్యగొంతు కోసిన భర్త
* రక్తపుమడుగులో అక్కడికక్కడే మృతి
* అడ్డుకోబోయిన కుమార్తెపై దాడి
* పరారీలో నిందితుడు
ఆకేరు న్యూస్, ఖమ్మం : ఖమ్మంలో భయానక ఘటన చోటుచేసుకుంది. భార్య గంతు కోసి భర్త అతికిరాతకంగా చంపేశాడు. ఖమ్మం పట్టణంలో భాస్కర్, సాయివాణి కొన్నేళ్లుగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య గొడవలతో వేరువేరుగా నివసిస్తున్నారు. దీంతో నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో పనిచేస్తూ సాయివాణి తన పిల్లలను పోషించుకుంటుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భాస్కర్ నేరడ గ్రామం నుంచి వచ్చి సాయివాణి ఇంటి వద్ద కాపుకాసాడు. సాయివాణిపై కత్తితో దాడిచేసి విచక్షణరహితంగా గొంతు కోశాడు. తీవ్ర రక్తపు మడుగులో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకోబోయిన కుమార్తెపై దాడికి దిగాడు. దీంతో కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సాయివాణి గొంతుకోసి భాస్కర్ పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని ఖమ్మం టూ టౌన్ సీఐ పరిశీలించారు. భాస్కర్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఐ తెలిపారు.
……………………………………………………………..
