* లింక్ ఓపెన్ చేశారో.. ఇంతే సంగతులు
ఆకేరు న్యూస్, ఢెస్క్ : రోజు రోజుకీ ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా మోసపోయేవాళ్లు మోసపోతూనే ఉన్నారు, మామూలు పోలీసుల కంటే సైబర్ క్రైం పోలీసులకే ఎక్కువగా పని ఉంటోంది. సైబర్ మోసగాళ్లు పెట్రేగిపోతున్నారు. వాట్సప్ లో వచ్చిన లింక్ ఓపెన్ చేశామంటే బ్యాంక్ అకౌంట్లో ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయే ప్రమాదం ఉంది. తీరా పోసపోయాక కానీ తెలిసిరావడం లేదు. తాజాగా తాజాగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జిల్లాలోని బీబీపేటలో వాట్సప్‌కు వచ్చిన లింకులను ఓ వ్యక్తి ఓపెన్ చేశాడు. లింక్ ఓపెన్ చేసి టాస్క్ లను పూర్తి చేస్తే లక్షలకు లక్షలు వస్తాయని సైబర్ మోసగాళ్ల మాటలకు మోసపోయి వాళ్లు చెప్పినట్లు చేసి 6 లక్షలు పోగొట్టుకొని లబోదిబో మంటున్నాడు. చివరికి సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………………………………….
