* ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠ నిలబడాలి
* హైదరాబాద్ కలెక్టర్ హరిచందన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల్లో ఈసారి ఎలాగైనా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగాల్సిందేనని, అందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన (Collector Harichandana) ఉపాధ్యాయులకు సూచించారు. అందుకే ప్రభుత్వ పరంగా ఏం చేయాలో నివేదిక అందించాలని పేర్కొన్నారు. ఏటా జిల్లాలో టెన్త్ (Tenth) ఉత్తీర్ణత పడిపోతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నందమూరి బసవతారకనగర్ (ఎన్బీటీ)లోని ప్రైమరీ, ఉన్నత పాఠశాలలను గురువారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సమయానికి సరైన ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల తరగతి గదులు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, పరీక్షలు దగ్గర పడుతున్నందున విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలన్నారు. తొలుత భవిత కేంద్రాన్ని, క్రీడా మైదానాన్ని కలెక్టర్ సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
……………………………………………………..
