* డీజీపీ ఎదుట సరెండర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట కేంద్ర, రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి మొత్తం 37 మంది సరెండర్ కానున్నారు. వీరి లొంగుబాటును డీజీపీ కార్యాలయం ధృవీకరించింది. ఈ రోజు మధ్యాహ్నాం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. వీరిలో అజాద్, అప్పాసి నారాయణ, ఎర్రా ఉన్నట్లు సమాచారం.
