ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తిరుపతి, షిర్డీ వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి, షిర్డీ కి తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు అధిక సంఖ్యలో వెలుతుంటారు. తిరుపతి-షిర్డీ-తిరుపతి, చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. తిరుపతి-షిర్డీ సాయినగర్ (07637) రైలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 28 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ రైలు ప్రతి ఆదివారం వేకువ జామున 4గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. షిర్డీ సాయినగర్-తిరుపతి (07638) రైలు డిసెంబర్ ఒకటి నుంచి 29వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
……………………………………………..
