* సీఎం పర్యటన నేపథ్యంలో కీలక పరిణామం
ఆకేరు న్యూస్, డెస్క్: కొడంగల్‌లో వ్యాపార సంఘాలు బంద్ పాటిస్తున్నాయి. ఇక్కడ నెలకొల్పాల్సిన సమీకృత గురుకులాలు. మెడికల్ కాలేజీ, వెటర్నటీ కళాశాలలను దుద్యాల మండలానికి తరలిస్తున్నారని వ్యాపార వర్గాలు ఆవేదన వ్యక్తం చేసింది. కొడంగల్ డెవలప్మెంట్ కమిటీ (కెడిసి) జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్‌ను పాటిస్తున్నాయి. కొడంగల్‌కు ఇచ్చిన వాగ్దానాలను సీఎం రేవంత్ విస్మరించారని.. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలు, గురుకులాలు ఇక్కడే ప్రారంభిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం వెంటనే స్పందించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని దుద్యాలకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
……………………………………………………………………
