* 2026 ఫిబ్రవరి 15 వరకు..
మూడు రాష్ట్రాల సీఎంల గడవు కోరిన మావోయిస్టులు
* ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల
ఆకేరు న్యూస్, డెస్క్, ఆయుధాల విరమణపై మావోయిస్టులు కీలక లేఖ విడుదల చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేష్, ఛత్తీష్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు 2026 ఫిబ్రవరి 15 వరకు గడువు ఇవ్వాలని కోరారు. మూడు రాష్ట్రాల్లోని బలగాలు కూంబింగ్ నిలిపివేస్తే ఆయుధాలు వదిలేసే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ పెద్దలతో కలిసి కూలంకుశంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట విడుదల చేసిన లేఖలో తెలిపారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రెడ్ సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని.. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం ఆయుధాలు వదిలేయాలని భావిస్తోందని.. అందుకు తమకు 2026 ఫిబ్రవరి 15 వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఇంత సమయాన్ని కోరేందుకు వేరే ఉద్దేశం లేదని.. తామందరం కలిసి మాట్లాడుకునేందుకు సమయం పడుతుందని అందుకే ఈ గడువు కోరుతున్నామని తెలిపారు. పీఎల్జీఏ వారోత్సవాలను సైతం నిర్వహించబోమని లేఖలో స్పష్టం చేశారు.
……………………………………………….
