* భర్తను హతమార్చిన భార్యలు
* ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో అతి దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యలు కలిసి వారి భర్తను అతి కిరాతకంగా చంపేశారు. చిత్రహింసలకు గురి చేసి మరీ ఈ ఘోరానికి ఒడిగట్టారు. దేవక్కపేటకు చెందిన మోహన్‌కు కవిత, సంగీత ఇద్దరు భార్యలున్నారు. వీరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం గొడవకు దిగారు. మాటామాటా పెరిగి గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో ఇద్దరు భార్యలు ఏకమై భర్త మోహన్‌పై పెట్రోల్ పోశారు. అదే కోపంతో నిప్పంటించారు. మంటల్లో కొట్టుమిట్టాడుతున్న మోహన్‌ను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి మోహన్ మృతి చెందాడు.
………………………………………..
