* అనుమానాస్పద అంశాలున్నాయంటూ ఆరోపణ
* అసలు నిజాలు ప్రజలకు తెలియాలన్న న్యాయవాది విజయ్
ఆకేరు న్యూస్, డెస్క్ : హిడ్మా ఎన్కౌంటర్పై న్యాయవాది విజయ్ ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఏపీ మారేడుపల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మావో అగ్రనేత హిడ్మా మరణించారు. ఈ ఎన్కౌంటర్పై అనేక అనుమానాలున్నట్లు ప్రజా సంఘాల నాయకులు ఇదివరకే ఆరోపించాయి. హిడ్మా ఎన్కౌంటర్పై పోలీసులు నమోదు చేసిన ఎప్ ఐ ఆర్ నెంబర్లు 52/2025, 53/2025 లలో అనేక అనుమానాలున్నాయని ఎన్హెచ్ఆర్సీకి తెలిపారు. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని.. హిడ్మా ఎన్కౌంటర్పై పూర్తి సమాచారం.. అందుకు సంబంధించిన సాక్ష్యాలను చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. చట్టాలను పోలీసులైనా.. మావోయిస్టులైనా తమ చేతుల్లోకి తీసుకోవడం నేరమవుతోందన్నారు. హిడ్మా ఎన్కౌంటర్పై న్యాయవాది చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు చేపడుతుందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.
……………………………………………………
