ఆకేరు న్యూస్, కరీంనగర్ : ప్రభుత్వ విప్, వేములవాడ ఎంఎల్ ఏ ఆది శ్రీనివాస్‌కు పెను ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ నాయకులు, అధికారులతో కలిసి ఆయన పట్ణంలోని డబుల్ ఇళ్ల నిర్మాణాలను మంగళవారం పరిశీలించారు. సిరిసిల్ల ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్, విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు కలిసి గృహ సముదాయం వ్దద బేస్మెంట్పై నిల్చోని ఉన్నారు. అదికాస్తా వెంటనే కుంగిపోయింది. దీంతో అధికారుల్లో అలజడి మొదలైంది. తేరుకున్న నేతలు వెంటనే ఆది శ్రీనివాస్‌ను కుంగిన ప్రాంతం నుంచి పక్కకు తీశారు. కిందపడిపోకుండా తమ నాయకున్ని రక్షించుకున్నారు. పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అధికారులు, నాయకులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
………………………………………..
