ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పల్లె నగారా మోగనుంది. కాసేపట్లో షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ మేరకు సాయంత్రం 6:15 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ మీడియా సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్నారు. షెడ్యూల్ ప్రకట వెలువడిన వెంటనే 31 జిల్లాలోని 545 మండలాలు, 12733 గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. డిసెంబర్లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేసింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ను ఈరోజు సాయంత్రం 6:15 గంటలకు ఈసీ విడుదల చేయనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముది మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
………………………………………………….
