* కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆందోళన
ఆకేరు న్యూస్, ఖమ్మం : ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. పార్టీ సీనియర్ నాయకులు సామినేని రామారావు హత్యకు నిరసనగా కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు సీపీఎం నాయకులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నాయకులను అడ్డగించారు. నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట నెలకొంది. నాయకుల తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పోలీసుల తీరుపై మండిపడ్డారు.
…………………………………………………..
