* లక్ష్యం 549 పరుగులు
ఆకేరు న్యూస్, డెస్క్ : గువాహటి టెస్టులో భారత్ అష్టకష్టాలు పడుతోంది. విజయ లక్ష్యం 549 పరుగులు ఉండడంతో ఆందోళనలో ఉంది. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 260/5 పరుగుల వద్ద డిక్లేర్ అయింది. దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ లో 288 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ స్కోర్లు ఇలా ఉన్నాయి. దక్షిణాఫ్రికా 489 కాగా భారత్ 201. ఈ టెస్ట్ లో దక్షిణాఫ్రికా మొదటి నుంచీ పట్టు బిగించింది. దక్షిణాఫ్రికా ముందు భారత బౌలర్లు, బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. సొంత గడ్డపై కనీసం ఫాలో ఆన్ కూడా అందుకోలేకుండా భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ లో భారత్ ఓటమి నుంచి తప్పించుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
……………………………………………………
