* బీజేపీ వర్సెస్ ఎంఐఎం
* దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి బీజేపీ నిరసన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రేటర్ కౌన్సిల్ సమావేశం గరం గరంగా సాగింది. మంగళవారం నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఆధ్యాంతం గందరగోళం నెలకొంది. వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో నుంచి లేవలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేమాతర గీతం పాడితేనే దేశంలో ఉండాలంటూ నినాదాలు చేశారు. బీజేపీ, ఎంఐఎం నాయకుల మధ్య మాటల వార్ మెదలైంది. కార్పొరేటర్ల మధ్య దూషనలపర్వం మొదలైంది. సభా సజావుగా సాగేందుకు సహకరంచాలని కాంగ్రెస్ నాయకులు ఇరు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు సూచించారు. మరో రెండున్నర నెలల్లో ప్రస్తుత పాలక వర్గం గడువు ముగియనుంది. ఈ సమావేశంలో 95 ప్రశ్నలు, 45 అజెండ అంశాలపై చర్చించాల్సి ఉంది. సమావేశానికి ముందు బీజేపీ కార్పొరేటర్లు దున్నపోతుకు వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేసి సమావేశానికి హాజరయ్యారు.
……………………………………………………………..
