ఆకేరు న్యూస్, హనుమకొండ : మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడ్ని ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం ఉదయం మడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శశాంక్ అనే యువకుడు రోడ్డు పక్కనున్న డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలై అపస్మారకంగా అక్కడే పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. దీంతో తక్షణం స్పందించిన మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ హుటా హుటీనా సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన యువకున్ని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన పోలీసుల తీరును ప్రజలు అభినందించారు.
…………………………………………………………………
