ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లాలోని నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చారు. ఇందుకు గాను ఆదేశాలు జారీ చేశారు. నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమునారెడ్డి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమీన్‌పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీకే తండాలను నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీలో కలిపి మున్సిపాలిటీగా మార్చాలని పిటిషన్లో తెలిపారు. దీంతో హైకోర్టు మేజర్ గ్రామ పంచాయతీని వెంటనే మున్సిపాలిటీగా మార్చాలని ఆదేశించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో.. ఎన్నికల కోడ్‌కు ముందే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది.
………………………………………………………….
