ఆకేరు న్యూస్, కమలాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలివిడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కమలాపూర్ ఎం.పీ.డీ.ఓ కార్యాలయం, అంబాల లోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు.అందుబాటులో ఉన్న సదుపాయాలు, అవసరమైన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో గుండె బాబు, సంబంధిత అధికారులు ఉన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
– ఎంపీడీవో గుండె బాబు
గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఎంపీడీవో గుండె బాబు అన్నారు. బుధవారం కమలాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సన్నాహక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ… మండలంలో 24 గ్రామపంచాయతీలకు 10 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ నామినేషన్ కేంద్రాల్లో ఈనెల 27 నుండి 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, నామినేషన్ అభ్యర్థి గ్రామపంచాయతీ నుండి నో డ్యూ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఎన్నికల నిబంధన ప్రకారము జత చేయవలసిన అన్ని పత్రములను నామినేషన్ ఫారానికి జతచేసి, అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు మాత్రమే నామినేషన్ కేంద్రంలో వచ్చి నామినేషన్ వేయాల్సి ఉంటుందని ఎంపీడీవో తెలిపారు. నామినేషన్‌కు వచ్చిన మిగతా వారందరూ నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ఉండాలని ఎంపీడీవో తెలిపారు. ఈ సన్నాహక సమావేశంలో సిఐ హరికృష్ణ, తాసిల్దార్ సురేష్ బాబు, ఎంఈఓ శ్రీధర్, ఎంపీ ఓ చేతన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

……………………………………………………..
