* 182 గంటల్లో 164 గంటలు వారికే
* టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
ఆకేరు న్యూస్, తిరుమల : శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు.. పద రోజుల పాటు నిర్వహించే వైకుంఠ ద్వారదర్శనాల్లో సామన్య భక్తులకే ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు టీటీడీ ఆలయ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వైకుంఠ ద్వారా దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పది రోజుల్లో 182 గంటలకు గాను 164 గంటలను సామాన్య భక్తులకే కేటాయించామన్నారు. రూ. 300 శ్రీ వారి టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తామన్నారు. వైకుంఠద్వార దర్శనానికి వచ్చే భక్తులు తితిదే సూచనలు పాటించాలని కోరారు. ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
………………………………………………
