ఆకేరు న్యూస్, హైదరాబాద్ : డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా..ఈ దాందా మాత్రం ఆగడం లేదు. తాజాగా మాదాపూర్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఇద్దరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఎస్వోటీ పోలీసులు తనిఖీ చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని వారి నుంచి 14 గ్రాముల ఎండీఎంఏ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సరం వేడుకలకు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. బెంగుళూర్, గోవా నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.
………………………………………………………..
