ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పంచాయతీ పోరులో కీలక ఘట్టం మొదలైంది. నేటి నుంచి తొలి విడత నామిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 10:30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. నేటి నుంచి ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తునట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఈనెల 30న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు డిసెంబర్ 3వ తేదీ వరకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 11న తొలి విడతలో 189 మండలాలు, 37440 వార్డులు, 4,236 గ్రామాల్లో ఎన్నికలు ఉంటాయి. ఇందుకు సంబంధించి గెజిట్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
………………………………………………..
