* నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ కామెంట్స్
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ తెలిపారు. బీసీలపై కాంగ్రెస్‌కు ప్రేమ లేదని.. ఎన్నికల స్టంట్‌గానే ఉపయోగించుకుంటుందని వాపోయారు. గురువారం ఎంపీ అరవింద్ నిజామాబాద్‌లో పలు కార్యక్రమాలకు హాజరై మీడియాతో మాట్లాడారు. రైల్వే పనులకు నిధులు విడుదల చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలిపారు. రైల్వే పనులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే నిరాహార దీక్ష చేస్తానని తాను ప్రకటించానని గుర్తుచేశారు. నిజామాబాద్ జిల్లాలో 10 ఆర్వోబీలు పూర్తి చేయాలనేది తన టార్గెట్ అని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని.. అభివృద్ధిపై శ్రద్ధ లేదని.. కేంద్రం ఇచ్చే నిధులకోసమే పంచాయతీ ఎన్నికలు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమైందని ఎద్దేవా చేశారు.
………………………………………………..
