* తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీ సీ కెమెరాల నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో ఆరు లక్షలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం బెస్టు పోలీసింగ్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. వాహనాలు, క్రేన్లు, ఇతర సామాగ్రిని అందించారు. ఎంపవరింగ్ ఎవ్రీడే సేఫ్టీ టీం అని పేరు పెట్టింది. సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానంగా పని చేస్తారు. బస్టాండ్లు, మెట్రోస్టేషన్లు, మాల్స్, రద్దీ ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది.
……………………………………………….
