* అహంకారంతో మాట్లాడితే నాయకుడు కాడు
* కేసీఆర్ అనంతరం బీఆర్ ఎస్‌లో చీలిక
ఆకేరు న్యూస్, జనగాం : మాజీ మంత్రి కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. అహంకారంతో మాట్లాడితే.. నాయకుడు కాలేడని చెప్పారు. కేటీఆర్ తీసుకునే నిర్ణయాలతోనే పార్టీలో ఉన్న నేతలు బీఆర్ ఎస్‌ను వీడుతున్నారని తెలిపారు. బీఆర్ ఎస్‌లో ఎవరికివారే యమనాతీరే అన్న చందంగా మారిందని.. హరీష్ రావు ఒక దారి.. కేటీఆర్‌ది మరో దారి.. అధినేత కేసీఆర్‌ది ఇంకోదారని.. దీంతో నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కడియం మండిపడ్డారు. అసలు బీఆర్ ఎస్ కథ ముగిసిందని.. ఆయన ఉన్నన్ని రోజులే హరీష్‌రావు పార్టీలో ఉంటారని.. తరువాత పార్టీలో చీలికతప్పదని చెప్పారు. నాయకులు కార్యకర్తలు, ప్రజల మేలు కోసం పని చేయాలని.. అది మరిచి కేటీఆర్ అహంకారంతో మాట్లాడితే ఎవరు ఒప్పుకోరన్నారు. అసలు అలాంటి నాయకుడు.. నాయకుడే కాడన్నారు. ఆయనపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయని.. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవుపలికారు.
……………………………………………..
