* నిరసనగా 30న ఛత్తీస్‌గఢ్ బంద్
* డీకేఎస్జడ్సీ కార్యదర్శి వికల్ప్ పేరిట లేఖ విడుదల
ఆకేరు న్యూస్, డెస్క్ : మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ సహా మరో 50 మంది పోలీసుల అదుపులో ఉన్నారని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ డీకేఎస్జడ్సీ విడుదల చేసిన లేఖలో తెలిపింది. నవంబర్ 18న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ పోలీసులు పట్టుకొని కాల్చిచంపారని.. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో హిడ్మా సహా ఆరుగురు మరణించారని పోలీస్ బలగాలు కట్టుకథలు చెబుతున్నారని మండిపడింది. మరునాడు ఈ నెల 19న అదే ప్రాంతంలో సురేశ్, శంకర్ సహా ఏడుగురిని బూటకపు ఎన్కౌంటర్లో చంపారని లేఖలో తెలిపింది. ఆ సమయంలోనే దేవ్‌జీతోపాటు మరో 50 మందిని వివిధ ప్రాంతాల నుంచి పోలీసుల అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. కార్పొరేట్ కను సన్నల్లోనే కేంద్రం పని చేస్తోందని.. అందులో భాగంగానే అడవిలో ఉన్న లక్షల చెట్లను నరికి వేస్తోందని.. ఇక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచిపెట్టేందుకే ఈ దాడులకు పాల్పడుతున్నారని మండిపడింది. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న చత్తీస్‌గఢ్ దండకారణ్య బంద్‌కు పిలుపునిచ్చారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని వెంటనే కోర్టులో హాజరుపరిచాలని డిమాండ్ చేసింది.
……………………………………………
