ఆకేరు న్యూస్, నిజామాబాద్ : ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ శేఖర్ వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన వ్యక్తి తన ఇంటి నెంబర్ కేటాయించాలని కమిషనర్ ఆశ్రయించాడు. ఇందుకు గాను మున్సిపల్ కమిషనర్ రూ. 50 వేలు డిమాండ్ చేశారు. ఇరువురి సయోధ్యతో రూ. 20కు ఒప్పందం కుదిరింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ ఆర్మూర్‌లోని మున్సిపల్ కమిషనర్ ఇంటి వద్ద అతని డ్రైవర్‌కు రూ. 20 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టకున్నారు. డ్రైవర్ రాజు వద్ద ఉన్న బ్యాగ్‌ను ఏసీబీ అధికారులు తనిణీ చేయగా రూ. 4.30 లక్షలు లభించినట్లు అధికారులు తెలిపారు. కమిషనర్ రాజు, డ్రైవర్ భూమేష్లను ఏసీబీ కోర్టులో హాజరు పరుచన్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ తెలిపారు.
……………………………………………..
