* వార్డుల వారీగా సమస్యలపై ఆరా
* వీధి కుక్కల సమస్య నివారణకు ఆదేశం
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని పలు వార్డుల్లో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మార్నింగ్ వాక్ చేస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా వీధి కుక్కుల సమస్యతో ఇబ్బందిపడుతున్నట్టుగా చెప్పడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడారు. వీధి కుక్కల సమస్యను నియంత్రంచేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సదరు అధికారులను ఆదేశించారు. అనంతరం మిషన్ భగీరథ కార్యాలయం సిబ్బందిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. వారిలో కొంత మంది ఆపరేటర్లు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్టుగా చెబుతూనే అందుకు వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోసమే సీఎం రేవంత్ పని చేస్తున్నారని.. పేదల అభ్యన్నతే తమ లక్ష్యమని ఎంఎల్ ఏ చెప్పారు.
…………………………………..
