* ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని వ్యాఖ్యానించింది. సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలనీ కోరుకుంటున్నారా ..? అని పిటీషనర్ను ప్రశ్నించింది. 42శాతం రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పాం కదా అని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 50 శాతం రిజర్వేషన్లు మించకుండా తామే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి, ఇప్పడు తామే స్టే ఎలా ఇస్తాం ..? అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలని కోరారు పిటిషనర్ న్యాయవాది. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హై కోర్టు తేల్చిచెప్పింది. సబ్ కేటగిరి రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.
……………………………………………
