* 20 మందికి తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో మరో బస్సు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా మద్దలకట్ట-సానికవరం జాతీయ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్సు మద్దలకట్ట-సానికవరం జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు సహాయక చర్యలు అందించారు. బాధితులను మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల్లో చాలా మంది శివస్వాములు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు అండగా నిలిచారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………..
