* రైలు పట్టాలపై బైఠాయించి కవిత ఆందోళన
* పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట
ఆకేరు న్యూస్, కామారెడ్డి : తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో కవిత కామారెడ్డిలో రైల్ రోకో చేప్టటారు. బీసీలకు 42 శాతం వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రైలు పట్టాలపై కవిత బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయమైంది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి.. ఇప్పుడు మాట తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు ఖచ్చితంగా 42 శాతం వాటా కల్పించాల్సిందేనని తేల్చి చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ మోసాలను జాగృతి ఎండగడుతుందని చెప్పారు.
……………………………………………
